Current affairs in Telugu March 2025

58వ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్
మధ్యప్రదేశ్ లోని మాధవ్ జాతీయ పార్కును 58వ టైగర్ రిజర్వుగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ ప్రకటించారు.
57వ టైగర్ రిజర్వ్ రతపాణి టైగర్ రిజర్వ్
మధ్యప్రదేశ్ లోని మొత్తం టైం రిజర్వ్ పార్కులు 9 గలవు
చేతిరాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గడ్ మంత్రి
చతిస్గడ్ ఆర్థిక మంత్రి బీపీ చౌదరి చేతిరాతతో రాష్ట్ర బడ్జెట్‌ను రాసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇలా చేతిరాతతో బడ్జెట్ రూపొందించడం తొలిసారి కావచ్చు
వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ 1.65 లక్షల కోట్ల అంచనాలతో 2025 26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను మార్చి 4న ఛత్తీస్గడ్ శాసనసభలో ప్రవేశపెట్టారు.
శక్తి యాప్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం ఈ యాప్ ను తీసుకురావడం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 2025న ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్‌ను ఆవిష్కరించారు
మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ లోని గివే కంప్లైంట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మరణం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు అయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మృతి చెందారు.
ఈయన కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసి ఆలిండియా రేడియోలో ఏ గ్రేడ్ గాయకులుగా పనిచేశారు
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి తన ఆస్థాన విధ్వాన్సునిగా పనిచేశారు.
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ఫిబ్రవరి 23 2023న ఈయన భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు అందజేశారు.
అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం
మార్చ్ 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం జరుపుకుంటారు.
మహిళా న్యాయమూర్తుల న్యాయం ప్రజాస్వామ్యం మానవ హక్కులను నిలబెట్టడంలో మహిళా పాత్ర కీలకమని ఉత్సవాన్ని జరుపుకుంటారు
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2021 ఏప్రిల్ 28న ఆమోదించిన 75/274 తీర్మానం ప్రకారం మార్చ్ 10వ తారీఖున అంతర్జాతీయ మహిళా న్యాయ దినోత్సవం ప్రకటించబడింది
మొదటి అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని మార్చ్ 10 2022న జరిపారు.
భారతదేశ సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా దీవి గారు 1989లో నియమించబడ్డారు
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్
కేరళలోని కప్పడ్ బీచ్ చల్ బీచ్ ల కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభించింది.
దీనితో బుక్ లాక్ సర్టిఫికెట్ పొందిన బీచ్‌ల సంఖ్య 13 కు చేరింది.
పర్యావరణ పరిరక్షణ భద్రతల్లో ఉన్న ప్రమాణాలను పాటించే వీచులకు ఈ సర్టిఫికెట్ లభిస్తుంది.
డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ సర్టిఫికెట్‌ను అందజేస్తుంది.
కెనడా నూతన ప్రధాని ఎన్నిక
కెనడా నూతన ప్రధాని గా లిబరల్ పార్టీ కి చెందిన మార్క్ కార్ని ఎన్నికయ్యారు.
ఈయన కెనడా 24వ ప్రధాని.
బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా కాలనీ 2003-04 వరకు పనిచేశారు.
2013 నుంచి 2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు 120వ గవర్నర్ గా కూడా పనిచేశారు.
హంట వైరస్
ఎలుకల మూత్రం ,లాలాజలం మరియు మలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందదు
ఈ వైరస్ లక్షణాలు:
జ్వరం, వనకడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, విరోచనాలు ,కడుపు నొప్పి ఎండ శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా వస్తాయి.
రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.
ఆసియా మహిళల కబడ్డీ విజేత భారత్
Iran లోని tehran లో జరిగిన ఆసియా మహిళ కబడ్డీ ఛాంపియన్షిప్ భారత్ విజేతగా నిలిచింది.
భారత్ ఇరాన్ మధ్య జరిగిన ఫైనల్ లో భారత్ 32-25 తేడాతో ఇరాన్ ను ఓడించింది.
2005, 2007,2008,,2017 లో భారత్ విజయం సాధించింది,
భారత్ ఐదవ సారి ఈ టైటిల్ సాధించింది.
ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు
24వ ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు మార్చ్ ఐదు నుండి ఏడు వరకు ఢిల్లీలో జరిగింది
కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ గారు ప్రారంభించారు.
ఈ సదస్సును ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది (TERI)
ఈ సదస్సుకు గయానా దేశం ప్రధానమంత్రి మార్క్ ఫిలిప్స్ బ్రెజిల్ దేశ పర్యావరణ మంత్రి మెరినా సిల్వ హాజరయ్యారు.
సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు 2025 ను గయానా ఉపాధ్యాయుడు డాక్టర్ భరత్ జగ్డియో , మరియు బ్రెజిల్ పర్యావరణ మంత్రి మెరీనా సిల్వాలకు TERI ప్రధానం చేసింది.