ఇండియన్ పాలిటి indian polity

  రాజ్యాంగం అంటే ఏమిటి ? constitution of india
1000052929 ఇండియన్ పాలిటి indian polity



రాజ్యాంగం అంటే ప్రజలు ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే నియమాల సముదాయం రాజ్యాంగం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన భారత రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు పాలకులకు ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యాంగం ప్రజలకు పాలకులకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది.
రాజ్యాంగం అనేది ప్రజల కొరకు పాలకుల కొరకు ఏర్పరిచిన నియమాల సమూహం రాజ్యాంగంలో ప్రజలు ఇలా మెలగాలి పాలకులు ఎలా పరిపాలించాలి అనేది రాజ్యాంగంలో అంతర్భాగం. మన రాజ్యాంగంలో అయితే మన రాజ్యాంగ ప్రవేశిక మన రాజ్యాంగ రచనకు మూలాధారం.
రాజ్యాంగంలో నియమాలు మాత్రమే ఉంటాయి ఆ నియమాలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన బాధ్యత మన దేశ అత్యున్నత పార్లమెంటుకు ఉంటుంది.

రాజ్యాంగం అంటే ఏమిటి? దీనిపై పలువురి అభిప్రాయాలు 

రాజ్యాంగం అంటే ప్రభుత్వ రూపం:prof.leecock

రాజ్యంలో రాజకీయ ప్రక్రియలను సక్రమమైన పద్ధతిలో జరగడానికి రాజ్యాంగం

 సహాయపడుతుంది:C.J.FEDRICK

పాలించే వారి అధికారాలను పాలించబడే వారి హక్కులను వివరిస్తూ ఆ రెండిటి పరస్పర సంబంధాన్ని సర్దుబాటు చేసే నియమాల సముదాయమే రాజ్యాంగం

.WOOLSEY 

రాజ్యంలో అంతర్భాగమైన పౌరుల అనూహ్యా బంధాన్ని నిర్ధారించే పద్ధతి రాజ్యాంగం. అరిస్టాటిల్(రాజ్యాంగ వాద మూల పురుషుడు)

రాజ్యాంగం లోని రకాలు types of constitutions

రాజ్యాంగంలో ముఖ్యంగా ఐదు రకాల రాజ్యాంగాలు ఉన్నాయి .

  1. లిఖిత రాజ్యాంగం (written constitution)
  2. అలిఖిత రాజ్యాంగం(Unwritten constitution)
  3. దృడ రాజ్యాంగం (Rigit constitution)
  4. అదృడ రాజ్యాంగం (Flexible constitution)
  5. దృడ, అదృఢ రాజ్యాంగం( Blend of Rigidity and flexibility)

1 written constitution :

రాజ్యాంగ మొత్తం ఒకచోట ఒక పుస్తకంలో లిఖితపూర్వకంగా ఉంటే దానిని లిఖిత రాజ్యాంగం అంటారు .
లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణలు :ప్రాన్స్ పోలెండ్, అమెరికా, భారత రాజ్యాంగం
1000052930 ఇండియన్ పాలిటి indian polity



Imp: మొదటి లిఖిత రాజ్యాంగం .
అతి దృఢమైన రాజ్యాంగం .
అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం


2)Unwritten constitution:

రాజ్యాంగం అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకే దగ్గర రాసి రాయబడి ఉండదు అంటే వారికి అవసరమైనప్పుడు రకరకాల చట్టాలను రిఫర్స్ చేస్తు  దానికి అనుగుణంగా ఉండే రాజ్యాంగాన్ని అలికిత రాజ్యాంగం అంటే ఇక్కడ రకరకాల బుక్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయ చట్టాలు కూడా ఈ రాజ్యాంగంలో రిఫర్ చేయవలసి  ఉంటుంది.

3 Rigit constitution (దృడరాజ్యాంగం )

ధృడ రాజ్యాంగం అంటే గట్టిదని కాదు ద్రుడ రాజ్యాంగం అంటే అంత సులభంగా మార్చడానికి అంటే సవరించడానికి వీలు లేని రాజ్యాంగాన్ని ద్రుడ రాజ్యాంగం అంటారు సవరించాలంటే దాని ప్రత్యేక మెజార్టీ పద్ధతి 2/3 లేదా త్రీ బై ఫోర్ వ మెజార్టీతో సవరించాలి 
Ex: అమెరికా 

4 Flexible constitution (అద్రుడ రాజ్యాంగము)

ఫ్లెక్సిబుల్ రాజ్యాంగ అంటే రాజ్యాంగం సవరించడం సులభంగా సులభంగా సవరించగలిగే రాజ్యాంగాన్ని ఫ్లెక్సీబుల్ రాజ్యాంగం అంటారు అంటే హాజరైన సభ్యుల్లో మొత్తం సభ్యులు సగం కంటే ఎక్కువ మంది ఉంటే మనం రాజ్యాంగ సవరణ అనేది చేయడానికి వీలుంటుంది ఇలాంటి రాజ్యాంగాన్ని అదృడ 
రాజ్యాంగం అంటాం.
దీనికి ఉదాహరణ బ్రిటన్  రాజ్యాంగం అదృడ రాజ్యాంగo

5 Blend of Rigidity and flexibility (దృడ, అదృడ రాజ్యాంగము 

భారతదేశ రాజ్యాంగాన్ని ధ్రుడా అద్రుడా రాజ్యాంగ కలయిక గా మనం చెప్పుకోవచ్చు మన రాజ్యాంగాన్ని సవరించే విధానం రెండు రకాలుగా ఉంటుంది సులభంగా సవరించుకోవచ్చు అలాగే కొన్ని అంశాలను ప్రత్యేక పద్ధతి ద్వారా మాత్రమే స్పెషల్ మెజారిటీ ద్వారా మాత్రమే మనం సవరించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మన భారత దేశ రాజ్యాంగం దృడ, అదృడ రాజ్యాంగం.

Leave a Reply

Scroll to Top